![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -443 లో.... పారిజాతాన్ని పంపించి చీరాబొట్టు తీసుకొని రమ్మంటాడు శివన్నారాయణ. అవి తీసుకొని వచ్చిన పారిజాతం.. శివన్నారాయణకి ఇస్తుంది. ఎప్పుడు నా ఇంట్లో శుభకార్యం జరిగిన ఒక చీరకొంటుంది. అలాంటిది ఈ ఇంట్లోనే శుభాకార్యం జరుగుతుంది.. అందుకే చీర తీసుకున్నానని శివన్నారాయణ పారిజాతంచే బొట్టు పెట్టించి కాంచనకి చీర ఇవ్వబోతుంటే.. ఎలా తీసుకొవాలి డ్రైవర్ తల్లికి ఇస్తున్నారా లేక ఇంటిఆడబిడ్డకి ఇస్తున్నారా అమ్మ ఆశీర్వాదం అనుకుంటానని కాంచన ఎమోషనల్ అవుతుంది.
మీ అమ్మ ఆశీర్వాదం అనుకోమని శివన్నారాయణ అనగానే కాంచన సంతోషంగా తీసుకుంటుంది. ఆ తర్వాత ఈ పెళ్లి ఎలా ఆపాలని పారిజాతం, జ్యోత్స్న డిస్కషన్ చేసుకుంటుంటే అప్పుడే శ్రీధర్ వస్తాడు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్తాడు. నువ్వు ఒప్పుకోవడం వల్లే కదా పెళ్లి ఇక్కడ వరకు వచ్చిందని శ్రీధర్ పై పారిజాతం కోప్పడుతుంది. కొన్ని ఎమోషన్స్ కి లొంగి రావాల్సి వచ్చిందని శ్రీధర్ అంటాడు. ముగ్గురికి పెళ్లి ఇష్టం లేదు కాబట్టి ముగ్గురం కలిసి ఎలా ఈ పెళ్లి ఆపాలో ట్రై చేద్దామని శ్రీధర్ అంటాడు. దానికి వాళ్ళు సరే అంటారు.
మరుసటి రోజు పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. దశరథ్ బంధువులని ఆహ్వానిస్తుంటాడు. శివన్నారాయణ శౌర్యతో ఆడుకుంటాడు. కార్తీక్ ని కాంచన రెడీ చేస్తుంది. దీపని సుమిత్ర రెడీ చేస్తుంది. దీపపై సుమిత్ర కోప్పడుతుంటే.. నువ్వు దీప చేసిన ఏ పనులు గుర్తుచేసుకోకు మమ్మీ అంటూనే అన్నీ గుర్తుచేసి దీపపై సుమిత్రకి కోపం వచ్చేలా చేస్తుంది జ్యోత్స్న. పువ్వులు దీపకి పెట్టు మమ్మీ అని సుమిత్రకి జ్యోత్స్న పువ్వులు ఇస్తుంది కానీ ఆ పువ్వులు సుమిత్ర కిందపడేస్తుంది. దాంతో దీప బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |